4:54 pm
Tuesday, October 20, 2020

28°C
Vishakhapatnam, India

బాలీవుడ్​లో నెపోటిజం నిజమే: తాప్సీ 4 months ago

ముంబై: ఈ మధ్య ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అంశాలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హిందీ నటుడు సుశాంత్ రాజపుట్ ఆత్మహత్య తర్వాత నెటిజన్స్ విమర్శల జడివాన కురిపించడంతో స్టార్స్ కూడా తమ గొంతు విప్పుతున్నారు.

ఇక  దర్శకేంద్రుడు  కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన  ఝుమ్మంది నాదం అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా  పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ కూడా తాజాగా చేసిన కామెంట్ వైరల్ అయింది.

ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి  వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకని కొంతకాలం పాటు హీరోయిన్ గా కొనసాగింది.  ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలపై మనసు మళ్లడంతో అక్కడికి మకాం మార్చి బాగానే రాణిస్తోంది.

అయితే తాజాగా తాప్సీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన ఫాన్స్ తో ముచ్చటించింది. ఇందులో ముఖ్యంగా తాను కూడా ఒకప్పుడు నెపోటిజం కారణంగా పలు సినిమా అవకాశాలను కోల్పోయానని తాప్సి చెప్పింది. కొందరు దర్శక నిర్మాతలు మొదటగా తనకి సినిమా అవకాశం ఇచ్చిన తర్వాత డబ్బు, పలుకుబడి, బందు ప్రీతి వంటి కారణాలతో తనని తప్పించి ఇతరులకి అవకాశం ఇచ్చేవారని ఈ అమ్మడు  ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే సినిమా పరిశ్రమలో మనకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత మనపైనెపోటిజం ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాప్సీ పన్ను బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు  వినీల్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్న హసీనా దిల్ రుబా అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ భాషలో కూడా జన గన మణ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.