మోదీ: కొవిడ్​తో పేరెంట్స్​ ను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు

By udayam on May 31st / 5:17 am IST

కొవిడ్​ మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భవిష్యత్తును ఆదుకోవడానికి పిఎం కేర్స్​ ద్వారా నిధులను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వారికి 23 ఏళ్ళు వచ్చే సరికి వారి ఖాతాల్లో రూ.10 లక్షల మొత్తాన్ని జమ చేస్తామని తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన పిల్లలందరికీ పాఠశాలల్లో చదువు నిమిత్తం రూ.20 వేల స్కాలర్​షిప్​, ప్రతీ నెలా రూ.4 వేల ఆర్ధిక సాయం చేస్తామని తెలిపారు. దీంతో పాటు వీరికి ఉన్నత చదువుల కోసం రుణాలు సైతం ఇస్తామని తెలిపారు.

ట్యాగ్స్​