ఢిల్లీ: మద్యం అమ్మకాల్లో సరికొత్త రికార్డ్​.. 7 రోజుల్లో కోటి బాటిళ్ళు.. రూ.218 కోట్ల ఆదాయం

By udayam on January 3rd / 10:34 am IST

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘనంగానే స్వాగతం పలికారు. డిసెంబర్​ 24–31 మధ్య ఈ రాష్ట్రలో ఏకంగా 1.10 కోట్లకు పైగా మందు బాటిళ్ళు అమ్మకాలు జరుపుకోగా.. వీటి ద్వారా రూ.218 కోట్ల ఆదాయం దక్కింది. డిసెంబర్​ 31 రాత్రి ఒక్కరోజే 20.30 లక్షల బాటిళ్ళను మందుబాబులు కొనుగోలు చేశారు. కొత్త సంవత్సరం రోజున ఏకంగా రూ.45.28 కోట్ల లిక్కర్​ అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. గతేడాది ఇదే రోజుల్లో కేవలం 13.8 లక్షల లిక్కర్​ బాటిల్స్​ మాత్రమే ఇక్కడ అమ్ముడుపోయాయి.

ట్యాగ్స్​