ఫిఫా ప్రపంచకప్ ఫైనల్స్‌లో విజయం తర్వాత ఖతార్ చక్రవరి షేక్ తమీమ్ బిన్ హమద్ ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సికి ‘బిష్ఠ్’ అనే సంప్రదాయ వస్త్రాన్ని బహూకరించిన సంగతి తెలిఇసందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వస్త్రం గురించి చర్చ జరుగుతున్న వేళ ఓ వ్యక్తి ఏకంగా మెస్సీకి బంపరాఫర్ ఇచ్చాడు. ‘మిలియన్ డాలర్లు ఇస్తా. ఆ బిష్ఠ్ ను తనకు ఇచ్చేయ్’ అంటూ ఒమన్ ఎంపీ, లాయర్ అహ్మద్ అల్ బర్వాని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. జీవితంలో ఏదైనా సాధ్యమే అనే సందేశం ప్రజలకు ఇచ్చేందుకు ఇది గుర్తుగా ఉంటుందని పేర్కొన్నాడు.