యుపి రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

By udayam on June 23rd / 8:12 am IST

ఉత్తరప్రదేశ్​లోని పిలిభిట్​ ప్రాంతంలో ఈ తెల్లవారుఝామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. హరిద్వార్​ నుంచి భక్తులతో తిరిగి వస్తున్న డిసిఎం వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును గుద్దేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో 7 గురు గాయపడ్డారని గజ్రౌలా పోలీసులు తెలిపారు. పురానాపూర్​ హైవేలో డిసిఎం డ్రైవర్​ నిద్రమత్తులో వాహనంపై కంట్రోల్​ వదిలేశాడని దాంతోనే ఈ యాక్సిడెంట్​ జరిగిందని పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను బరేలీలోని ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్​