ఉత్తరాఖండ్​: 29 పర్వతారోహకులపై హిమపాతం

By udayam on October 4th / 11:02 am IST

ఉత్తరాఖండ్​లో కురుస్తున్న భారీ హిమపాతం వల్ల 29 మంది పర్యాటకులు ద్రౌపది దండా–2 పర్వత శిఖరాగ్రంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వీరంతా ట్రైనీ పర్వతారోహకులుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్ ధామీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీరంతా ఉత్తర కాశీలోని నెహ్రూ మౌటెనీరింగ్​ ఇన్​స్టిట్యూట్​కు చెందిన వారుగా తెలుస్తోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు సముద్రమట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగింది.

ట్యాగ్స్​