కాబూల్ లో వరుస బాంబు పేలుళ్ళు.. 10 మంది మృతి

By udayam on January 2nd / 6:26 am IST

కొత్త ఏడాది రోజును ఆఫ్ఘనిస్థాన్​ బాంబులతో ఆహ్వానించింది. ఆ దేశ రాజధాని కాబూల్ లోని సైనిక విమానాశ్రయం వద్ద జరిగిన బాంబు దాడుల్లో కనీసం 10 మంది పౌరులు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. మిలిటరీ ఎయిర్ పోర్టు మెయిన్ గేటు వద్ద భారీ విస్ఫోటనం సంభవించిందని తాలిబాన్ ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఇటీవల తాలూఖాన్ నగరంలో పేలుడు జరిగి నలుగురు గాయపడగా, ఆ ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత కాబూల్ ఘటన చోటుచేసుకోవడం ఆఫ్ఘన్ లో భద్రత ఏపాటితో తెలుస్తోంది.

ట్యాగ్స్​