సరెండర్​ ఆలోచనలో 100 మంది మావోయిస్టులు

By udayam on September 13th / 9:18 am IST

దాదాపు 100 మందికి పైగా మావోయిస్ట్​లు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ఆలోచిస్తున్నారని ఇండియన్​ ఎక్స్​ప్రెస్​ వార్తను రాసింది. ఇదే నిజమైతే ఇప్పటికే రిక్రూటింగ్​ లేక చతికిలపడ్డ ఎర్రజెండాకు ఇది మరో శరాఘాతం కానుంది. ఇలా లొంగిపోదామని ఆలోచన చేస్తున్న వారిలో సీనియర్​ లీడర్లు, దళాల సభ్యులు, మిలీషియా మెంబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన కొద్ది నెలల్లో ఏకంగా 150 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కరోనా, కరోనా సంబంధిత ఆరోగ్య సమస్యలే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ట్యాగ్స్​