ఐక్యరాజ్య సమితి: వలసబాటలో 10 కోట్ల మంది

By udayam on December 27th / 11:22 am IST

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద మిలియన్ల మంది తమ స్వస్థలాలను విడిచి ఉపాధి, ఆవాసం కోసం వేరే ప్రాంతాలకు తరలిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. శరణార్ధుల వలసల్లో ఇదే ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక సంఖ్య అని పేర్కొన్నారు. ఓ వైపు యుద్ధం, మారుతున్న వాతావరణ పరిస్థితులే ఈ భారీ వలసకు ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు యుఎన్‌హెచ్‌ఆర్‌సి అధ్యక్షుడు ఫిలిప్పో గ్రాండి పేర్కొన్నారు. వేలాది మంది వలసదారులు ఐరోపాను ఇష్టమైన గమ్యస్థానంగా భావిస్తున్నారని, దీంతో అక్రమ రవాణాదారుల చేతుల్లో తమ జీవితాలను ఉంచుతున్నారని తెలిపారు.

ట్యాగ్స్​