కరోనా వ్యాక్సినేషన్‌ను 100 శాతం పూర్తి చేసిన తెలంగాణ తొలి జిల్లాగా కరీంనగర్ రికార్డ్ నెలకొల్పింది. ఈ జిల్లాలోని అర్హులందరికీ మొదటి, రెండవ డోసులను 100 శాతం అందించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దక్షిణ భారతంలో బెంగళూరు అర్బన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో జిల్లా కరీంనగరేనని అధికారులు తెలిపారు. 7.92 లక్షల మంది ప్రజల కోసం పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించామని అధికారులు తెలిపారు.