100 ఏళ్ళ వచ్చినా న్యాయవాదిగానే

By udayam on June 10th / 7:07 am IST

చాలా మందికి వయసు ఓ నెంబర్​ మాత్రమే. రాజస్థాన్​కు చెందిన ఈ 100 ఏళ్ళ లాయర్​ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాది అంటే 1947లో లాయర్​ ప్రాక్టీస్​ మొదలుపెట్టిన లేఖ్​రాజ్​ మెహతా ఇప్పటికీ అదే వృత్తిలో కొనసాగుతూ ఔరా అనిపిస్తున్నారు. ఈ రంగంలో ఉంటూ ఆయన ఎందరో చీఫ్​ జస్టిస్​లతోనూ, ముఖ్యమంత్రులతోనూ పనిచేసిన ఆయన అంతర్జాతీయ కోర్టుల్లోనూ తన వాదనా పటిమను ప్రదర్శించారు. కరోనా కఠిన పరిస్థితుల్లో సైతం ఆయన ఆన్​లైన్​ ద్వారా తన వాదనలు వినిపిస్తున్న వీడియో ఆన్​లైన్​లో వైరల్​ అవుతోంది.

ట్యాగ్స్​