కేరళలో భారీ వర్షాలు.. 11 మంది మృతి

By udayam on October 17th / 7:05 am IST

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం నుంచి కురుస్తున్న ఈ వర్షాల ధాటికి ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో కొండ చరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ కనిపించడం లేదు. ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించడానికి ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​ ఎన్​డిఆర్​ఎఫ్​ సిబ్బంది రంగంలోకి దిగారు. కేరళ మొత్తానికి ఎల్లో అలెర్ట్​ జారీ చేవారు. మొత్తం 11 జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

ట్యాగ్స్​