గురుగ్రామ్​: ఈ 11 రకాల కుక్కలపై బ్యాన్​

By udayam on November 17th / 12:30 pm IST

దేశ రాజధాని గురుగ్రామ్​ లో పెరుగుతున్న కుక్క కాటు కేసులకు ఆ నగర కార్పొరేషన్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నగరంలో 11 రకాల విదేశీ కుక్కల పెంపకంపై నిషేధం విధించింది. వీటిల్లో అమెరికన్​ బుల్​ డాగ్​, అమెరికన్​ పిట్​ బుల్​ టెర్రియర్స్​, డాగో అర్జెంటీనో, రాట్​ వీలర్​, బోయర్​ బోయెల్​, ప్రెసా కనారియో, నీపోలీషియన్​ మాస్టిఫ్​, ఉల్ఫ్​ డాగ్​, కేన్​ కోర్సో, లాండాగ్​, ఫిలా బ్రసీలీరో వంటి జాతులపై నిషేధం విధించింది. దీంతో ఇప్పటికే ఈ రకం జాతులను పెంచుకుంటున్న వారికి ఈ కుక్కల పెంపకానికి లైసెన్సులను రద్దు చేయాలని భావిస్తోంది. ఇటీవల ఓ మహిళను విదేశీ కుక్క కరిచిన కేసులో రూ.2 లక్షల జరిమానా విధించిన కార్పొరేషన్​.. అనంతరం కొన్ని జాతుల పెంపకంపై నిషేధం పెట్టింది.

ట్యాగ్స్​