‘మా’తో మాకు సంబంధం లేదు : ప్రకాష్ ప్యానెల్

By udayam on October 12th / 12:45 pm IST

మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​లో గెలుపొందిన ప్రకాష్​ రాజ్​ ప్యానెల్​లోని 11 మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈసారి ఎన్నికల్లో క్రాస్​ ఓటింగ్​, రౌడీయిజం జరిగిందని ఆరోపించిన ప్రకాష్​ రాజ్​ బెనర్జీ, తనీష్​లపై దాడి కూడా జరిగిందన్నారు. ముందు రోజు రాత్రి మా ప్యానెల్​లోని ఇద్దరు గెలిచామని ప్రకటించి, మరుసటి రోజు కాదు మీరు ఓడిపోయారని చెప్పడం దారుణమన్నారు. అయితే ప్రకాష్​ రాజ్​ వర్గం ‘ఆల్​ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్’ (ఆత్మ) పేరుతో కొత్త అసోసియేషన్​ ఏర్పాటు కానుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే వీరంతా రాజీనామా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్​