అగ్నిప్రమాదంలో 11 మంది చిన్నారులు మృతి

By udayam on May 27th / 9:36 am IST

సెనెగల్​ దేశంలోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన టివయూనే సిటీలోని మేమ్​ అబ్దు అజీజ్​ సై దబాఖ్​ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. షార్ట్​ సర్క్యూటే ఈ అగ్నిప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. పిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో అతి కష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

ట్యాగ్స్​