ఒకేసారి గర్భవతులైన వైద్య బృందం

By udayam on May 16th / 7:22 am IST

ఒకే ఆసుపత్రిలో పనిచేస్తున్న 11 మంది సిబ్బంది ఏకకాలంలో గర్భిణులు అయిన విషయం వైరల్​గా మారింది. ఇదంతా అమెరికాలోని మిస్సౌరీ నగరంలో ఉన్న లిబర్టీ ఆసుపత్రిలో జరిగింది. కొన్ని నెలల వ్యవధిలోనే 11 మంది ఆసుపత్రి స్టాఫ్​ పిల్లలకు జన్మనివనున్నారని కంపెనీ పేర్కొంది. 11 మందిలో 10 మంది నర్సులు కాగా ఒకరు డాక్టర్​. మే నుంచి నవంబర్​ వరకూ వీరంతా పిల్లలకు జన్మనివ్వనున్నారు. గతంలో మియామీ వ్యాలీ ఆసుపత్రిలో కూడా 11 మంది స్టాఫ్​ ఒకేసారి గర్భవతులయ్యారు.

ట్యాగ్స్​