ఓ హైవే పక్కన పూజలు చేస్తున్న భక్తులపైకి లారీ దూసుకొచ్చిన ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. బీహార్ లోని వైశాలీ జిల్లా దేస్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హాజీపూర్–మహ్నార్ రోడ్డు పక్కన ఉన్న ఆలయంలో గ్రామస్థులు పూజలు చేస్తున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిలో కొందరికి తీవ్ర గాయాలు కాగా వారికి చికిత్స కొనసాగుతోంది.