మలేషియా: కొండచరియలు విరిగి పడి 12 మంది మృతి.. 22 మంది గల్లంతు

By udayam on December 16th / 7:18 am IST

మలేషియా లోని కౌలాలంపూర్​ లో కొండ చరియలు విరిగిపడి 12 మంది మరణించారు. మరో 59 మందిని సురక్షితంగా కాపాడారు. మరో 22 మంది ఆచూకీ గల్లంతైన ఈ ఘటన కౌలాలంపూర్​ శివార్లలోని క్యాంప్​ సైట్​ లో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగే సమయంలో క్యాంప్​ సైట్​ లో మొత్తం 90 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో 8 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్​