టిఎంసిలోకి 12 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు

By udayam on November 25th / 5:45 am IST

పశ్చిమ బెంగాల్​ సిఎం మమతా బెనర్జీ బయట రాష్ట్రాల్లోనూ తన పట్టును పెంచుకుంటున్నారు. గోవాలోనూ టిఎంసి పార్టీని బలోపేతం చేస్తున్న ఆమె తాజాగా మేఘాలయ రాష్ట్రంపై మరింత దృష్టిని పెట్టారు. దీంతో ఆ రాష్ట్రంలో ఉన్న 17 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేల్లో 12 మంది టిఎంసిలోకి చేరడానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్​ ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. మేఘాలయ ఇన్​ఛార్జ్​ మనీష్​ ఛత్రాత్​ మేఘాలయ చేరుకుని ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

ట్యాగ్స్​