రోడ్డు మీదకు దూసుకొచ్చిన మెట్రో

By udayam on May 4th / 6:02 am IST

ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో మెట్రో ట్రైన్​ రోడ్డు మీదకు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 70 మందికి గాయాలయ్యాయి. సోమవారం రాత్రి 10.30 గంటలకు మెక్సికో రాజధాని మెక్సికో సిటీలోని అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మీదకు దూసుకువచ్చిన ఈ ట్రైన్​ రోడ్డుపై ఉన్న కార్లమీద పడిపోయింది. ఈ ప్రమాదంలో చాలా మంది ట్రైన్​ భోగీల్లో చిక్కుకుపోయారు. వీరిని రక్షించడానికి మెక్సికో రక్షక బృందం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ట్యాగ్స్​