వరదలకు 13 మంది మృతి

By udayam on July 21st / 11:39 am IST

చైనాలోని సెంట్రల్​ హెనాన్​ ప్రావిన్స్​లో 1000 ఏళ్ళలోనే భారీ వర్షపాతం నమోదైంది. దీంతో సైన్యం రంగంలోకి దిగి హోటళ్ళు, సబ్​వేలు, పబ్లిక్​ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల్ని హెలికాఫ్టర్ల సాయంతో రక్షిస్తోంది. ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో 13 మంది వరదల్లో మరణించగా 1 లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1.26 కోట్ల జనాభా ఉండే ఈ ప్రావిన్స్​ రాజధాని ఝెంఝౌలో 457.5 మి.మి. వర్షం కురిసింది. వరదల ధాటికి ఈ ప్రావిన్స్​లోని అల్యూమినియం ఫ్యాక్టరీ మంటల్లో చిక్కుకుని కాలిపోయింది.

ట్యాగ్స్​