ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి 13 మంది మృతి

By udayam on May 18th / 9:42 am IST

గుజరాత్​లోని మోర్చి జిల్లా హల్వాద్​ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది కార్మికులు దుర్మరణం చెందారు. వీరు పనిచేస్తున్న ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల్లో మరో 30 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్​ ఉందని అధికారులు చెబుతున్నారు. శరవేగంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. కూలీలంతా గోడ పక్కనే కూర్చుని మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్​