ఆ బ్యాన్ మనకి వర్తించదు : ఏపీ

By udayam on August 19th / 9:29 am IST

ఏపీ సహా 13 రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వివరణ ఇచ్చారు. పవర్‌ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలూ లేదని స్పష్టం చేశారు. సమాచారం లోపం వల్లే విద్యుత్‌ క్రయ విక్రయాల నిషేధిత జాబితాలో ఏపీని చేర్చారని చెప్పారు. ‘‘విద్యుత్‌ క్రయవిక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఏపికి వర్తించదు. ఏపీ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.350కోట్లు ఇప్పటికే చెల్లించేశాయి. సమాచారం లోపం వల్లే నిషేధిత జాబితాలో ఏపీ పేరు చేర్చారు. రాష్ట్రం నుంచి సమాచారం వెళ్లడంతో ఆ జాబితా నుంచి ఏపీ పేరు తొలగించారు’’ అని వివరించారు.

ట్యాగ్స్​