బిజెపి దేశం కోసం కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదన్న కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. దేశం కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతోపాటు మరెందరో కాంగ్రెస్ నేతలు ప్రాణ త్యాగాలు చేశారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై రాజ్యసభ స్పీకర్ ధన్ ఖర్ సైతం ‘మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.