ఈనెల 7న ఉత్తరాఖండ్లో సంభవించిన జలప్రళయంలో గల్లంతైన 136 మందీ మరణించినట్లేనని ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు.
మంచు కొండలు కరిగి హఠాత్తుగా ఏర్పడ్డ జలప్రళయంలో వీరంతా కొట్టుకుపోయినట్లు తెలిపిన అధికారులు 15 రోజులు గడిచినా వారి జాడ కనిపించలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 60 మంది మృతదేహాలు లభ్యమవ్వగా మిగతా వారి ఆచూకీ లభించలేదని తెలిపారు.
ఈ ప్రమాదంలో మొత్తం 5 బ్రిడ్జిలు పూర్ఇతగా ధ్వంస మవ్వగా, ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ సైతం 90 శాతం కొట్టుకుపోయింది.