మెక్సికో సరిహద్దులో ఉన్న ఓ జైలుపై ఆయుధాలతో విరుచుకుపడ్డ దుండగులు 14 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. వీరి కాల్పుల్లో మరణించిన వారిలో 10 మంది పోలీసులు ఉండగా.. మరో నలుగురు జైలు ఖైదీలు. జుయారెజ్ నగరంలో జరిగిన ఈ కాల్పులకు స్థానిక డ్రగ్స్ ముఠాలే కారణంగా పోలీసులు గుర్తించారు. ఇలా జైలుపై కాల్పులు జరిపిన దుండగులు తమ డ్రగ్స్ ముఠాకు చెందిన వారిని విడిపించుకుని పారిపోయినట్లు తెలుస్తోంది.