పోరస్​ ల్యాబ్​ గ్యాస్​ లీక్​: 140 కి చేరిన బాధితుల సంఖ్య

By udayam on June 3rd / 12:50 pm IST

విశాఖలోని అచ్యుతాపురం సెజ్​లో అమ్మోనియా గ్యాస్​ లీకై ఆసుపత్రిపాలైన వారి సంఖ్య 140కు చేరింది. పోరస్​ లాబొరేటరీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీ నుంచి లీకైన ఈ గ్యాస్​ను పీల్చడంతో అక్కడ పనిచేస్తున్న 140 మంది వర్కర్లకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చాలా మందికి వాంతులు అవ్వడంతో పాటు కళ్ళు మండడం వంటి లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదు.

ట్యాగ్స్​