అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సనారో.. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దారిలో నడిచాడు. తన మద్దతు దారుల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన లూలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాడు. నిరసనకారులు బ్రెజిల్ అధ్యక్ష భవనం కిటికీల్లో నుండి ఫర్నీచర్‌ను విసిరేశారు. అత్యున్నత న్యాయస్థానంలోని కొన్ని గదులపైనా దాడి చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ విధ్వంసం సాగింది. లెజిస్లేటివ్ పోలీసులకు చెందిన కొన్ని వాహనాలపై కూడా దాడి చేశారు.
Solid turnout at an anti-Bolsonaro rally “in defense of democracy” in #Rio on a Monday night despite the rain. Crowd is young and full of energy. #Brazil pic.twitter.com/IRsUvr4V9W
— Laurel Chor (@laurelchor) January 9, 2023