సిక్కిం: 100 అడుగుల లోయలో పడ్డ మిలటరీ ట్రక్కు.. 16 మంది జవాన్లు మృతి

By udayam on December 23rd / 11:39 am IST

ఉత్తర సిక్కింలో చైనా సరిహద్దులకు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. 20 మంది జవాన్లతో వెళ్​తున్న మిలటరీ ట్రక్కు లోయలో పడిపోయిన ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. వారిలో 13 మంది జవాన్లు కాగా, ముగ్గురు జూనియర్ కమిషన్డ్ అధికారులు ఉన్నారు. నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని హెలికాప్టర్ లో బెంగాల్ లోని ఆసుపత్రికి తరలించారు. ఓ మలుపు వద్ద వాహనం వీరి వాహనం 100 అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పడి నుజ్జునుజ్జయింది. ఈ విషాద ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ట్యాగ్స్​