బీహార్​ : చెల్లెలి ప్రియుడ్ని ముక్కలుగా నరికిన అన్న

By udayam on December 27th / 9:33 am IST

బీహార్​ లో ఓ అన్న.. తన చెల్లెలి ప్రియుడ్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలుగా ఆహారంగా వేసేశాడు. బిట్టు కుమార్ అనే యువకుడు ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రెండు రోజుల తర్వాత 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో రాహుల్ అనే యువకుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిట్టు తన సోదరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, అందుకనే అతడిని మట్టుబెట్టానని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​