చైనా: రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి

By udayam on January 9th / 5:18 am IST

చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జియాంగ్సి ప్రావిన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. ఈ భారీ ప్రమాదానికి పొగమంచే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నట్లు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ముందు ప్రయాణిస్తున్న వాహనానికి తగినంత దూరంలో ఉండాలని, లైన్​ మారడం, ఓవర్​ టేక్​ చేయడానికి ప్రయత్నించవద్దని చైనా పోలీసులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.

ట్యాగ్స్​