ఈరోజు వివిధ రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది దుర్మరణం చెందారు. కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన ప్రమాదంలో ప్యాసింజర్ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులోని 8 మంది ప్రయాణికులు మరణించారు. 26 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్షార్–మీరట్ హైవేపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటంబానికి చెందిన 5 గురు దుర్మరణం చెందారు. వీరంతా ఉత్తరాఖండ్‌లోని కేథార్‌నాథ్‌కు వెళ్తున్నారు. అస్సాంలో అతివేగంతో వెళ్తున్న ట్రక్ రోడ్డుపై తిరగబడి 4 గురు దుర్మరణం చెందారు.