మయన్మార్​: స్కూల్​పై తుపాకీ ల ఫైరింగ్​.. 11 మంది పిల్లలు మృతి

By udayam on September 21st / 5:20 am IST

ఉత్తర మియన్మార్‌లో ఒక స్కూలు మీద సైనిక హెలికాప్టర్ కాల్పులు జరపడంతో సుమారు 11 మంది పిల్లలు చనిపోయారని యూనిసెఫ్ తెలిపింది. రెబల్స్ పట్టులో ఉన్న సగాయింగ్ రీజియన్‌లో గల ఒక టెంపుల్ స్కూల్ మీద మియన్మార్ ఆర్మీ కాల్పులు జరిపిందని పేర్కొంది. అయితే ఆ స్కూల్లో దాక్కుని ఉన్న తిరుగుబాటుదారుల మీద తాము దాడి చేశామని మియన్మార్ మిలిటరీ తెలిపింది. అదే రోజు ఇదే గ్రామంలోని ఆరుగురు గ్రామస్థులను సైనికులు కాల్చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్​