మధ్యప్రదేశ్ కు చెందిన 17 ఏళ్ళ లలిత్ పాటీదార్ అత్యంత అరుదైన రేర్ వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ హైపర్ ట్రికోసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి బారిన పడ్డ చిన్నారుల ఒంటి మొత్తం భారీ స్థాయిలో జుట్టు పెరుగుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదు. అయితే తన జుట్టును తాను బ్లీచింగ్, కటింగ్, షేవింగ్, వాక్సింగ్ చేస్తూ తొలగించుకుంటున్నట్లు పటీదార్ వెల్లడించారు. ‘నేను రోడ్డు మీద వెళ్తే నన్ను మనిషిలానే చూడట్లేదు. నాపై రాళ్ళు విసురుతున్నారు. నేను వాళ్ళను ఏమీ అనకుండానే ఇదంతా జరుగుతోంది. నా వ్యాధికి కారణం కూడా నాకు తెలియదు. మా ఇంట్లో కూడా ఎవరికీ ఈ జట్టు లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు లలిత్.