స్కూలో గొడవ.. విద్యార్థిని చంపేసిన తోటి విద్యార్థులు

By udayam on October 1st / 6:03 am IST

స్కూలులో జరిగిన చిన్న గొడవను మనసులో పెట్టుకున్న ఐదుగురు విద్యార్థులు.. తమ తోటి విద్యార్ధిని కత్తితో పొడిచి చంపేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో మృతుడిని బురారికి చెందిన దీపాన్షుగా పోలీసులు గుర్తించారు. గురువారం జరిగిన ఈ ఘటనలో నిందితులందరూ 17 ఏళ్ళ వయసు వారేనని, వీరంతా మృతుడి క్లాస్​మేట్స్​ గా పేర్కొన్నారు. స్కూలులో జరిగిన గొడవే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. బటన్​ నొక్కితే బయటకు వచ్చే కత్తితో వీరు అతడిని దారుణంగా పొడిచి చంపేశారన్నారు.

ట్యాగ్స్​