బిఆర్‌ఎస్‌కు 18 మంది ఆదివాసి సర్పంచుల రాజీనామా

By udayam on December 28th / 10:12 am IST

కుమురం భీం జిల్లాలో బిఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జిల్లాలోని వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వాంకిడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్‌లు ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో 2019లో పార్టీలో చేరామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభవృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గెలిచి అధికారం చేపట్టిన తొలి రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికీ బిల్లులు రాలేదన్నారు.

ట్యాగ్స్​
BRS