ఆఫ్ఘనిస్థాన్​ : ట్యాంకర్​ పేలి 19 మంది మృతి

By udayam on December 19th / 7:04 am IST

ఆఫ్ఘనిస్థాన్‌లో ఒక సొరంగంలో ఇంధన ట్యాంకర్‌ పేలుడుతో 19 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కాబూల్‌కు ఉత్తరంగా 80 మైళ్లు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉందని, మృతులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలపడంలో కీలకంగా ఉండే ఈ సొరంగ మార్గంలో ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌ పూర్తిగా స్థంభించిపోయింది.

ట్యాగ్స్​