కంబోడియాలో అగ్ని ప్రమాదం.. 19కి చేరిన మృతుల సంఖ్య

By udayam on December 30th / 7:18 am IST

కంబోడియాలోని గ్రాండ్ డైమండ్ సిటీ హోటల్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. బాంటే మీంచే ప్రావిన్స్ పరిధిలోని పోయ్పెట్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో దాదాపు 60మందికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. ఈ హోటల్ థాయ్ లాండ్ సరిహద్దులో ఉంది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా కంబోడియా, థాయ్ లాండ్ దేశాలకు చెందినవారే ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

ట్యాగ్స్​