పుజారా ఫాస్టెస్ట్​ సెంచరీ.. 512 రన్స్​ ఆధిక్యం వద్ద భారత్​ డిక్లేర్​

By udayam on December 16th / 11:04 am IST

తొలి టెస్ట్​ లో భారత్​ 513 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్​ కు నిర్దేశించింది.ఈరోజు తొలి సెషన్లోనే బంగ్లాను 150 కు ఆలౌట్​ చేసిన భారత్​.. ఆపై 258/2 పరుగులకు రెండో ఇన్నింగ్స్​ ను డిక్లేర్డ్​ చేసింది. శుభ్​ మన్​ గిల్​ 110 ఔట్​ కాగా.. పుజారా తన కెరీర్లోనే ఫాస్టెస్ట్​ సెంచరీ 102 (130 బాల్స్)లో చేశాడు. అతడికి విరాట్​ కోహ్లీ 19 నాటౌట్​ గా ఉండి సహకరించాడు. పుజారా ఇన్నింగ్స్​ తో భారత్​ ఆధిక్యం 500 రన్స్​ దాటేసింది. ఈరోజు ఆట ముగిసే సరికి బంగ్లాదేశ్​ ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేశారు. విజయం కోసం బంగ్లా ఇంకా 471 పరుగులు చేయాల్సి ఉంది.

ట్యాగ్స్​