ఇళ్ళపై కూలిన విమానం.. ఇద్దరు మృతి

By udayam on October 12th / 11:43 am IST

కాలిఫోర్నియాలోని ఓ నివాస ప్రాంతంలో చిన్న విమానం ఒకటి కూలిపోయింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 2 ఇళ్లు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి,. 6 సీట్ల ట్విన్​ ఇంజిన్​ ఎయిర్​క్రాఫ్ట్​ అరిజోనా లోని యుమా నుంచి బయల్దేరి కాలిఫోర్నియా సమీపంలో కూలిపోయినట్లు ఫాక్స్​ న్యూస్​ ప్రకటించింది. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గర్లోనే స్కూలు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ట్యాగ్స్​