అస్సాం: చిరుత దాడిలో 15 మందికి గాయలు

By udayam on December 27th / 9:18 am IST

అస్సాంలోని జోర్హాట్‌లో ఓ చిరుత హల్ చల్ చేసింది. చిరుత దాడులతో 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిలో నలుగురు అటవీశాఖ అధికారులు కూడా ఉన్నారని అన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించామని, పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. రెయిన్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ) జోర్హాట్‌ పట్టణ శివార్లలోని అటవీ ప్రాంతంలోఉండటంతో.. ఆహారం కోసం చిరుత క్యాంపస్‌లోకి చొరబడి ఉంటుందని జోర్హాట్‌ ఇన్‌ఛార్జి డిఎఫ్‌ఒ రంజిత్‌ కొన్వర్‌ తెలిపారు. గత 24 గంటల వ్యవధిలో ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐలోని అధికారులతో పాటు పరిసర ప్రాంతాల్లోని మహిళలు, చిన్నారులపై దాడి చేసిందని అన్నారు.

ట్యాగ్స్​