పాకిస్థాన్లోని సర్బాంద్ నగరంలో నివసిస్తున్న సల్జీత్ సింగ్ (42), రంజీత్ సింగ్ (38)లను దుండగులు కాల్చి చంపారు. వీరి హత్యను భారత్ ఖండించింది. అక్కడి బాబా తాల్ బజార్లో దుకాణం నిర్వహిస్తున్న వీరిద్దరిపై బైక్పై వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దీంట్లో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పాకిస్థాన్ అనుమానిస్తోంది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు ఉంటాయని ఖైబర్ పఖ్తుంఖ్వా సిఎం మహమ్మూద్ ఖాన్ పేర్కొన్నారు.