ఐపిఎల్​ మినీ వేలం నేడే

By udayam on December 23rd / 6:00 am IST

ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) సీజన్‌-16కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 నుంచి జరగనుంది. లీగ్​ లోని 10 ఫ్రాంఛైజీలు తమకు అవసరమైన ఆటగాళ్ళ కోసం వేలాన్ని జరపనున్నాయి. 87మంది ఆటగాళ్ల కోసం 405 మంది దేశీయ, అంతర్జాతీయ ప్లేయర్లు రేసులో ఉన్నారు. ఇందులో 273మంది భారత క్రికెటర్లు ఉండగా.. మరో 132మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఈ మినీ వేలంలో మొత్తం అన్ని జట్లూ కలిపి రూ.206.5 కోట్లు ఖర్చు చేయనున్నాయి. హైదరాబాద్​ వద్ద అత్యధికంగా రూ.42.25 కోట్లు ఉంటే.. కోల్​ కతా వద్ద అత్యల్పంగా రూ.7.05 కోట్లు మాత్రమే ఉన్నాయి.

ట్యాగ్స్​