నిద్రిస్తున్న వారిపై పడ్డ రష్యా క్షిపణులు.. 21 మంది మృతి

By udayam on July 2nd / 6:48 am IST

ఉక్రెయిన్లపై రష్యా సైనికుల రాక్షస కాండ పెరుగుతూనే ఉంది. ప్రజలు నిద్రిస్తున్న సమయంలో వాళ్ళ ఇళ్ళపైకి రాకెట్ల వర్షం కురిపించిన ఈ సేనలు 21 మంది సామాన్యులను బలి తీసుకున్నాయి. ఉక్రెయిన్​ పోర్ట్​సిటీ ఒడెశాకు సమీపంలో ఓ ఉన్న బహుళ అంతస్తుల బిల్డింగ్​పై రష్యా శుక్రవారం అర్థరాత్రి జరిపిన ఈ రాకెట్​ దాడిలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. రాకెట్ల దాడితో 9 అంతస్తుల బిల్డింగ్​ పాక్షికంగా కూలిపోగా 21 మంది మృతి చెందారు. దీనికి సమీపంలోనే ఉన్న 14 అంతస్తుల బిల్డింగ్​ కూడా భారీగా ధ్వంసమైంది.

ట్యాగ్స్​