బన్నీ ఉత్సవంలో 21 మందికి గాయాలు

By udayam on October 16th / 10:47 am IST

దసరా సందర్భంగా కర్నూలు జిల్లాలో జరిగే బన్నీ ఉత్సవంలో (కర్రలతో కొట్టుకోవడం) 21 మందికి గాయాలయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం గాయపడ్డ వారి సంఖ్య 100కు పైగా ఉంటుందని తెలుస్తోంది. వీరిని ఆదోని, ఆలూరు ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స​ అందిస్తున్నారు. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది ఈ ఉత్సవం కోసం దేవరగట్టు గ్రామానికి చేరుకుని మాల మల్లేశ్వరస్వామి ఆలయ సాక్షిగా ఈ బన్నీ ఉత్సవాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్​