ఒడిశాలోని ఖుర్దాలో చిలికా నియోజకవర్గ ఎమ్మెల్యే కారు ప్రజలపైకి దూసుకెళ్ళడంతో 22 మంది గాయపడ్డారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున ఖుర్దా జిల్లా బానాపూర్ బ్లాక్ ఆఫీసు వద్ద వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు 500 నుంచి 600 మంది అక్కడ గుమిగూడి ఉన్నారు. ఇంతలో ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ కారు అక్కడున్న వారిపైకి దూసుకొచ్చింది. దీంతో కోపోద్రిక్తులైన జనం ఎమ్మెల్యేపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యేను పోలీసులు హాస్పిటల్కు తరలించారు.