ఒకే స్కూలులో 29 మంది విద్యార్థులకు కరోనా

By udayam on November 24th / 7:12 am IST

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్​ పాఠాలలో 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైరా పట్టణంలోని గురుకుల పాఠశాల, జూనియర్​ కాలేజీలో ఈ కరోనా కేసుల కలకలం రేగింది. ముందుగా కొద్ది మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో విద్యార్థులందరికీ పరీక్షలు చేయగా 29 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది. వీరిలో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవని జిల్లా మెడికల్​ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్​