విజయవాడ: మహిళను బంధించి 3 రోజుల పాటు సామూహిక అత్యాచారం

By udayam on December 20th / 11:05 am IST

మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన విజయవాడలో సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. నగరంలోని బెంజి సర్కిల్‌ వద్ద కూలి పనులు చేసుకుని బతికే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్‌ కాంప్లెక్స్లో పని చేసే వ్యక్తి ఈ నెల 17న నమ్మించి కానూరు సనత్‌నగర్లోని ఓ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో మూడు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్ప డ్డారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్​