బీఎఫ్-7 కరోనా వేరియంట్ : భారత్‌లో మూడు కేసులు

By udayam on December 22nd / 4:54 am IST

ఒమిక్రాన్ సబ్‌-వేరియంట్ అయిన బీఎఫ్.7కు సంబంధించి భారత్‌లో మూడు కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌లో 2, ఒడిశాలో ఒక కేసును గుర్తించారు. ప్రస్తుతం చైనాలో కేసులు పెరగడానికి బీఎఫ్.7 వేరియంట్ రకమే కారణం. ‘సెప్టెంబరు 11న అమెరికా నుంచి వచ్చిన ఒక మహిళకు అదే నెల 18న కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమెకు సోకిన వేరియంట్ బీఎఫ్.7గా నేడు తెలిసింది. ప్రస్తుతం ఆమె కోలుకుని బాగానే ఉన్నారు’ అని వడోదర మున్సిపాల్టీ తెలిపినట్లుగా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.

ట్యాగ్స్​