ఆటోపై గ్రానైట్​ పడి ముగ్గురు మృతి

By udayam on January 2nd / 5:43 am IST

లారీ నుంచి ఓ భారీ సైజు గ్రానైట్​ రాయి ఆటో మీద పడ్డ ఘటనలో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. బానోత్ సుమన్, శ్రీకాంత్ అనే వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రానైట్ లారీ ఖమ్మం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదకరంగా తీసుకు వెళుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోని యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశముంది.

ట్యాగ్స్​